IPL | రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఘన విజయం సాధించింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కేవలం 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్లలో రాహుల్ తెవాతియా 44, శివం దూబె 18 పరుగులు మినహా మిగతా బ్యాట్స్మన్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు.
యశస్వి జైస్వాల్, అనూజ్ రావత్, చిరిస్ మోరిస్ పరుగులు చేయకుండా.. డకౌట్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో కేకేఆర్ బౌలర్లు శివం మావీ, ఫెర్గూసన్, షాకిబ్ అల్ హసన్ కీలకంగా వ్యవహరించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్ 56, వెంకటేశ్ అయ్యర్ 38 పరుగులతో అలరించారు. నితీశ్ రాణా 12 పరుగులు చేసినా త్వరలోనే పెవిలియన్ బాట పట్టాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు మోరిస్, సకారియా, రాహుల్ తివాతియా, ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.