KKR vs SRH | మరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. పూరన్ కూడా అవుట్
సన్‌రైజర్స్‌ను గెలిపించేలా కనిపించిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (43) కూడా పెవిలియన్ చేరాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 178 పరుగుల లక్ష్యంతో సన్‌రైజర్స్ బరిలో దిగింది. అయితే కేన్ విలియమ్సన్ (9), రాహుల్ త్రిపాఠీ (9) ఇద్దరూ విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో అభిషేక్ మాత్రం నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
అయితే అతన్ని 12వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్ ఐదో బంతిని స్లాగ్ స్వీప్ చెయ్యడానికి ప్రయత్నించిన అభిషేక్.. బంతి చాలా స్లోగా రావడంతో టైమింగ్ మిస్ అయ్యాడు. దాంతో గాల్లోకి లేచిన బంతి స్క్వేర్ లెగ్ వైపుగా వెళ్లింది. అది చూసిన కీపర్ బిల్లింగ్స్ పరిగెడుతూ వెళ్లి క్యాచ్ పట్టేయడంతో అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆ తర్వాతి ఓవర్లోనే స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ (2)ను నరైన్ బోల్తా కొట్టించాడు. నరైన్ వేసిన బంతిని నేరుగా బౌలర్ వైపు కొట్టాడు పూరన్. దాన్ని నరైన్ ఒడిసి పట్టేయడంతో అతను పెవిలియన్ బాటపట్టాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

