కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎటాక్ ముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ తడబడుతోంది. పెద్దగా భారీ షాట్లు ఆడకుండానే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. మూడో ఓవర్లోనే దేవదత్ పడిక్కల్ (2) అవుటవగా.. తొమ్మిదో ఓవర్లో సౌతీ వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బట్లర్ కూడా వెనుతిరిగాడు.
ఫుల్ లెంగ్త్ బంతిని లాంగాన్ మీదుగా ఆడేందుకు బట్లర్ ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ మావి.. గాల్లోకి ఎగిరి మరీ క్యాచ్ పట్టేయడంతో బట్లర్ వెనుతిరగాల్సి వచ్చింది. అతను కనుక క్యాచ్ పట్టకపోయి ఉంటే అది కచ్చితంగా సిక్సర్ వెళ్లేదే. దీంతో రాజస్థన్ జట్టు 55 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.