వర్షార్పణం.. కోల్‌కతా, పంజాబ్ పోరుకు వరుణుడి ఆటంకం
సాఫీగా సాగుతున్న ఐపీఎల్లో అనూహ్యంగా వరుణుడు తొలి గోల్ కొట్టాడు. సోమవారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయంతో అర్ధాంతరంగా రైద్దెంది. ముందస్తు హెచ్చరికల ప్రకారమే మ్యాచ్ ఆరంభమైన పదిహేను నిమిషాలకే వరుణుడు ఈడెన్గార్డెన్స్ను వర్షంలో ముంచెత్తాడు.
- ఇరు జట్లకు చెరో పాయింట్
కోల్‌కతా : సాఫీగా సాగుతున్న ఐపీఎల్లో అనూహ్యంగా వరుణుడు తొలి గోల్ కొట్టాడు. సోమవారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయంతో అర్ధాంతరంగా రైద్దెంది. ముందస్తు హెచ్చరికల ప్రకారమే మ్యాచ్ ఆరంభమైన పదిహేను నిమిషాలకే వరుణుడు ఈడెన్గార్డెన్స్ను వర్షంలో ముంచెత్తాడు. సుమారు రెండుగంటల తర్వాత వర్షం తగ్గినా అప్పటికే ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట సాధ్యం కాదని తేల్చిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇరుజట్లకు తలా ఒక పాయింట్ దక్కింది.
3 ఓవర్లు కూడా పడకుండానే..
టాస్ గెలిచిన కోల్‌కతా.. మొదట బ్యాటింగ్‌కు వచ్చి ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బార్ట్లెట్ రెండో ఓవర్లో ప్రమాదకర ఫిన్ అలెన్ (6)తో పాటు రూ. 25 కోట్ల ఆటగాడు కామెరూన్ గ్రీన్ (4)ను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బతీశాడు. అదే బార్ట్లెట్ మరుసటి ఓవర్ విసిరేందుకు రాగా నాలుగు బంతులు పడగానే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. ఆట నిలిచే సమయానికి కోల్‌కతా 3.4 ఓవర్లకు 25/2తో నిలిచింది.
ఏడేండ్ల తర్వాత వరుణ్, నరైన్ లేకుండా..
కేకేఆర్ ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగింది. ఈ ఇద్దరూ జట్టులో లేకుండా మ్యాచ్ ఆడటం కోల్‌కతాకు గత ఏడేండ్ల (2019 లో చివరిసారి)లో ఇదే ప్రథమం. జట్టు ప్రాక్టీస్‌లో క్యాచ్ అందుకుంటుండగా వరుణ్‌కు గాయమవడంతో అతడు మ్యాచ్‌కు దూరమయ్యాడని కెప్టెన్ రహానే చెప్పినా ఇటీవల కాలంలో అతడు ఫామ్‌లేమితో తంటాలు పడుతుండటంతో అతడిని పక్కనబెడతారన్న వార్తలు వచ్చాయి. నరైన్‌ను కూడా కేకేఆర్ సరిగ్గా వినియోగించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నా ఈ మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా అతడిని పక్కనబెట్టడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

