కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. కెప్టెన్ రాహుల్ (41 నాటౌట్), డీకాక్ (41 నాటౌట్) ఇద్దరూ చూడచక్కని షాట్లతో అలరిస్తున్నారు. వీళ్ల భాగస్వామ్యాన్ని విడదీయడానికి కేకేఆర్ సారధి శ్రేయాస్ అయ్యర్ ఎలాంటి బౌలింగ్ మార్పులు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఎవరు బౌలింగ్ చేసినా వీళ్లిద్దరూ భారీ షాట్లు ఆడేస్తున్నారు. దాంతో పది ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 83 పరుగులు చేసింది.