కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టుకు శుభారంభం లభించింది. క్వింటన్ డీకాక్ (26 నాటౌట్), కేఎల్ రాహుల్ (18 నాటౌట్) ఇద్దరూ రాణించారు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న డీకాక్.. ఆ తర్వాత భారీ షాట్లు ఆడాడు.
డీకాక్ ఇచ్చిన క్యాచ్‌ను జట్టులో కొత్తగా చేరిన అభిజిత్ నేలపాలు చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ మొదట బ్యాటింగ్ చేస్తామని తెలిపాడు.