గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతాకు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. షమీ వేసిన ఆ ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన ఓపెనర్ శామ్ బిల్లింగ్స్ (4).. నాలుగో బంతికి అవుటయ్యాడు. షమీ వేసిన బౌన్సర్‌ను బిల్లింగ్స్ సరిగా ఆడలేకపోవడంతో.. ఎడ్జ్ తీసుకున్న బంతి చాలా ఎత్తుకు లేచింది.
దాన్ని కీపర్ సాహా సులభంగా అందుకున్నాడు. దాంతో బిల్లింగ్స్ మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఐదు పరుగులకే కోల్‌కతా జట్టు తొలి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మూడో ఓవర్లో మరోసారి బంతి అందుకున్న షమీ.. ఈసారి నరైన్ (5)ను అవుట్ చేశాడు. లెగ్ సైడ్ షమీ వేసిన బంతిని షార్ట్ ఫైన్ లెగ్ వైపు బాదడానికి నరైన్ ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఫెర్గూసన్ అందుకున్న చక్కని క్యాచ్‌తో నరైన్ నిరాశగా వెనుతిరిగాడు.