కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ మరో వికెట్ కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేలోపే శుభ్‌మన్ గిల్ (7) వికెట్ కోల్పోయిన ఆ జట్టును మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (25), కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే ఉమేష్ యాదవ్ వేసిన 11వ ఓవర్లో మూడో బంతికి సాహా అవుటయ్యాడు.
అంతకుముందు బంతిని క్రీజులో ఆఫ్‌సైడ్ వచ్చేసి బౌండరీ బాదిన అతను.. తర్వాతి బంతిని కూడా అలాగే ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఉమేష్ తెలివిగా వేసిన బంతికి అతను అనుకున్న షాట్ ఆడలేక కట్ చేసేందుకు ట్రై చేశాడు. అది కూడా సరిగా కుదరకపోవడంతో బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వెంకటేశ్ అయ్యర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 83 పరుగుల వద్ద గుజరాత్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా.. డేవిడ్ మిల్లర్ ఉన్నారు.