క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడుతున్న నితీష్ రాణా (30)ను ఢిల్లీ అవుట్ చేసింది. లలిత్ యాదవ్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన రాణా.. లాంగాన్‌లో పృథ్వీ షాకు చిక్కాడు. నేరుగా వచ్చిన క్యాచ్‌ను షా ఒడిసి పట్టేయడంతో రాణా మైదానం వీడాడు. రాణా అవుటవడంతో విండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ క్రీజులోకి వచ్చాడు.
ప్రస్తుతం కోల్‌కతా విజయావకాశాలు శ్రేయాస్, రస్సెల్ మీదనే ఆధారపడి ఉన్నాయనడం అతిశయోక్తేమీ కాదు. 107 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది.