కోల్‌కతా: మెకాలి గాయం కారణంగా ఐపీఎల్-19 నుంచి తప్పుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా స్థానాన్ని తన ఢిల్లీ జట్టు సహచర ఆటగాడు నవ్‌దీప్ సైనీ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ ధృవీకరించింది. రూ. 75 లక్షలతో అతడు కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ లీగ్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన సైనీ.. 23 వికెట్లు తీశాడు.