IRE vs CAN : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా దంచేసిన కెనడా(Canada) బ్యాటర్లు ఈసారి తడబడ్డారు. న్యూయార్క్‌లో ఐర్లాండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ విఫలమైనా..నికోలస్ కిర్టన్(49), వికెట్ కీపర్ శ్రేయాస్ మొవ్వ(37)లు ఉతికేశారు. ఐర్లాండ్ బౌలర్లను సమర్దంగా ఎదుర్కొని జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. ఈ ఇద్దరి బ్యాటింగ్ మెరుపులతో కెనడా 7 వికెట్ల నష్టానికి 137 రన్స్ కొట్టింది. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ, యంగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ ఓడిన కెనడాకు శుభారంభం దక్కలే. ఓపెనర్లు నవ్‌నీత్ ధలివల్(6), అరోన్ జాన్సన్(14)లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. యంగ్, డెలానీ విజృంభణతో పర్గాత్ సింగ్(18), దిల్‌ప్రిత్ బజ్వా(7)లు డగౌట్ చేరారు.
Nicholas Kirton’s on the charge – Canada can finish with a good total here #IREvCAN
LIVE: https://t.co/MdaLEFRWSr pic.twitter.com/wmcG5wHEcJ
— ESPNcricinfo (@ESPNcricinfo) June 7, 2024
పది ఓవర్లలోపే 53 పరుగులకే వికెట్లు పడిన జట్టును శ్రేయాస్ మొవ్వ(37), నికోలస్ కిర్‌స్టన్(49)లు ఆదుకున్నారు. చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్ బోర్డును కదిలించారు. కాస్త కుదురుకున్నాక ఇద్దరూ బౌండరీలతో చెలరేగారు. ఐదో వికెట్‌కు 75 రన్స్ జోడించడంతో కెనడా నిర్ణీత ఓవర్లలో 137రన్స్ చేయగలిగింది.
A 🔝 bowling effort from the Irish bowlers restricts Canada to 137/7 in New York 👏#T20WorldCup | #CANvIRE | 📝: https://t.co/F8JWtzoZDe pic.twitter.com/xPfwOZhhXo
— ICC (@ICC) June 7, 2024