హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్‌కౌన్సిల్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఏడేండ్ల తర్వాత రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు 2026 జనవరి 30న ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిందని, సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చినా బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించలేదని ఆరోపిస్తూ న్యాయవాది పుట్ట పద్మారావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారించింది. ఎన్నికల కోసం జారీచేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
గ్రూప్- 1 అక్రమాలపై నేడు విచారణ
హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షల్లో అవకతవక లు జరిగాయని సింగిల్ జడ్జి జారీచేసిన తీర్పు ను సవాల్ చేసిన అప్పీల్ పిటిషన్‌పై మంగళవారం డివిజన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. మారుల తుది జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేసి, పునర్మూల్యాంకనం చేయాలని లేకపోతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును టీజీపీఎస్సీతోపాటు అభ్యర్థులు అప్పీల్ దాఖలు చేశారు.