విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. టీ20 కెప్టెన్ పదవికి స్వయంగా రాజీనామా చేసిన కోహ్లీని బిసిసిఐ సెలెక్టర్లు వన్డే జట్టు సారథ్యం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయపై బిసిసిఐ, విరాట్ కోహ్లీల మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బోర్డు సెలెక్టర్లపై మండి పడ్డారు.
1983 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు, మాజీ ఆల్ రౌండర్ అయిన ఆజాద్.. కోహ్లీని సమర్థిస్తూ సెలెక్టర్లకు చురకలంటిచాడు. ఆయన శుక్రవారం ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ఈ విషయంలో మాట్లాడాలనుకోలేదు.. కానీ చెప్పక తప్పడం లేదు. సెలెక్టర్లను అవమానించాలనే ఉద్దేశ్యం నాకు లేదు.. కానీ ఒకసారి వారందరి మ్యాచ్‌లు చూస్తే అన్నీ కలిపి లెక్కిచినా విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచ్‌లలో అవి సగం కూడా ఉండవు. జట్టు కెప్టెన్సీ విషయంలో సెలెక్టర్లు నిర్ణయం తీసుకునేటప్పుడు బిసిసిఐ అధ్యక్షుడిని సంప్రదించాలి. అలా జరిగినట్లు నాకనిపించడంలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే విరాట్‌తో గంగూలీ ప్రత్యేకంగా మాట్లాడేవారు. కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు కాదు.. తప్పించిన విధానం గురించి కోహ్లీ బాధపడినట్లు నాకనిపిస్తోంది” అని ఆయన అన్నాడు.
ప్రస్తుతం బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉన్న చేతన్ శర్మ తన కెరీర్లో 23 టెస్టులు, 65 వన్డేలు ఆడారు. సెలెక్షన్ కమిలీ సభ్యుడు దేవాశీష్ మొహంతీ కేవలం 2 టెస్టులు, 45 వన్డేటు ఆడారు. మరో సభ్యుడు అభయ్ కురువిల్లా 10 టెస్టులు, 25 వన్డేలలో టీమిండియా తరపున ఆడారు. మరోవైపు విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 97టెస్టులు, 254 వన్డే మ్యాచ్‌లు ఆడారు.
రోహిత్, విరాట్ కలిసి ఆడకపోతే నష్టంతప్పదు
కీర్తి ఆజాద్ ప్రస్తుత టీమిండియా కెప్టెన్లు కలిసి ఆడకపోవడంపై స్పందిస్తూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలసి ఆడకపోతే జట్టుకు జరిగే నష్టం కన్నా వారిద్దరికి జరిగే వ్యక్తిగత నష్టమే ఎక్కువ. ఎందుకంటే.. క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలనే జట్టును నుంచి పక్కకు తప్పించారు. అందువల్లే రోహిత్, కోహ్లీ కలిసి ఆడకపోవండం వారికే నష్టం.