న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ సిక్సర్‌తో దుమ్మురేపింది. బుధవారం జరిగిన లీగ్ పోరులో హైదరాబాద్ 16-12 తేడాతో రోహ్తక్ రౌడీస్పై అద్భుత విజయం సాధించింది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది ఆరో విజయం కావడం విశేషం.
పోరు విషయానికొస్తే అండర్కార్డ్లో హైదరాబాద్ ఒకదాంట్లో గెలిచి రెండింటిలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన మెయిన్ కార్డ్‌లో హైదరాబాద్ రెజ్లర్లు పంజా విసిరారు. ధీరజ్‌సింగ్, మధుర.. ప్రత్యర్థులపై విజయాలతో హైదరాబాద్ విజయాన్నందుకుంది. గురువారం జరిగే పోరులో హైదరాబాద్..కొచ్చి కేడీస్తో తలపడుతుంది.