చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తొలిసారి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. శుక్రవారం జరిగే ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ముంబై తలపడనుంది. ఇటీవల క్వారంటైన్ పూర్తి చేసుకున్న 33ఏండ్ల పొలార్డ్ తొలిసారి నెట్స్‌లో సాధన చేశాడు. విండీస్ హార్డ్‌హిట్టర్ పలు రకాల షాట్లు ఆడుతున్న వీడియోను ఫ్రాంఛైజీ గురువారం ట్విటర్లో షేర్ చేసింది.
బిగ్ మ్యాన్..బిగ్ హిట్స్..బిగ్ మ్యాచ్ విన్నర్ అంటూ ట్వీట్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఈఏడాది కూడా టోర్నీ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. గత సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిట్స్పై నెగ్గి ఐదుసార్లు టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది.
Big man. Big hits. Big match player. 🔥
— Mumbai Indians (@mipaltan) April 8, 2021
Kieron Pollard hits the nets for the first time ahead of tomorrow's #IPL2021 opener 💙#OneFamily #MumbaiIndians #MI #MIvRCB @KieronPollard55 pic.twitter.com/E9LYI0iZnB