షెన్జెన్ (చైనా) : చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత వెటరన్ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ సంచలన విజయం సాధించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 33 ఏండ్ల శ్రీకాంత్ 21-18, 21-19తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, కెనడా స్టార్ విక్టర్ లాయ్‌కి షాకిచ్చి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో తను హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ యుతో తలపడనున్నాడు.
పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ -చిరాగ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో భారత జోడీ 21-15, 22-24, 21-9తో ఫ్రాన్స్‌కు చెందిన పోపోవ్ బ్రదర్స్‌పై పోరాడి విజయం సాధించింది. కానీ, మహిళల సింగిల్స్‌లో యంగ్ షట్లర్ తన్వి శర్మ 17-21, 21-18, 16-21తో ప్రపంచ 9వ ర్యాంకర్ తోమోకా మియాజా (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల – తనీషా క్రాస్టో జోడీ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది.