ఫులర్టన్ (అమెరికా) : యూఎస్ ఓపెన్ సూపర్ 300 బాడ్మింటన్ టోర్నమెంట్లో భారత వెటరన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రన్నరప్‌తో సరిపెట్టాడు. ఈ సీజన్లో తొలిసారి ఫైనల్ చేరిన అతను టైటిల్ నెగ్గలేకపోయాడు.
ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో ప్రపంచ మాజీ నంబర్ వన్ శ్రీకాంత్ 15-21, 21-16, 9-21 తో చైనీస్ తైపీ ఆటగాడు, 46వ ర్యాంకర్ సు లీ-యాంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. గంటకు పైగా సాగిన ఈ హోరాహోరీ పోరులో 33 ఏండ్ల్ల శ్రీకాంత్ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాడు.