Kidambi Srikanth | బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో తెలుగు క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పోరాడి ఓడాడు. రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. కిదాంబి శ్రీకాంత్‌పై 15-20, 20-22 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టిద్దామని భావించిన కిదాంబి ఆశలు అడియాసలయ్యాయి. ఇద్దరు ఆటగాళ్లు కూడా ఫైనల్ మ్యాచ్ తొలి సెట్ నుంచే హోరాహోరీ తలపడ్డారు. చివరకు కీన్ యూ తొలి సెట్‌ను కిదాంబిపై 15-21 తేడాతో గెలుచుకున్నాడు.
తొలి సెట్లో ఓటమి పాలైనా నీరసపడకుండా రెండోసెట్లో అద్భుతంగా ఆడి ఉత్కంఠకు తెర తీశాడు. ఒకదశలో ఇద్దరిస్కోర్ 20-20 కావడంతో టెన్షన్ ఎక్కువైంది. తర్వాత కిదాంబికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కీన్ యూ వరుసగా రెండు పాయింట్లు సాధించాడు. దీంతో 20-22 తేడాతో కీన్ యూ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.
ఇప్పటివరకు బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు చేరుకున్న మూడో భారతీయ షట్లర్‌గా కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. 2015లో సైనా నెహ్వాల్, 2017, 2018, 2019ల్లో పీవీ సింధూ ఫైనల్‌కు చేరుకున్నారు. 2019లో స్వర్ణ పతకం గెలుచుకున్న పీవీ సింధూ మిగతా రెండు దఫాలు రజత పతకాలను గెలుచుకున్నది. అంతకుముందు సైనా నెహ్వాల్ రజత పతకంతోనే సంతృప్తి చెందారు. ఈ టోర్నీలో కిదాంబికి రజతంతోపాటు సెమీస్‌లో ఓటమి పాలైన లక్ష్య సేన్.. కాంస్య పతకం పొందారు.