ఫులర్టన్ (యూఎస్): యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, తన్వి శర్మ ప్రిక్వార్టర్స్‌కు చేరారు. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్.. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో 21-14, 21-12తో భారత్‌కే చెందిన దయానంద్‌ను అవలీలగా ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో తన్వి.. 23-21, 21-16తో యవొన్ లీ (జర్మనీ)ని చిత్తుచేసింది.
దేవికా, రక్షిత సైతం ముందంజ వేయగా అన్మోల్ ఖర్బ్, ఆకర్షి కశ్యప్ తొలిరౌండ్‌కే వెనుదిరిగారు. మెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో రౌనక్ చౌహాన్.. 23-21, 21-16తో శంకర్ ముత్తుస్వామిపై విజయం సాధించాడు.