బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సుబ్రహ్మణ్యన్ క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21-19, 21-15తో జేసన్ గునవన్ను 42 నిమిషాల్లోనే ఓడించాడు.
మరో పోరులో సుబ్రహ్మణ్యన్ 9-21, 21-10, 21-17తో వర్డొయొపై గెలిచాడు. రక్షిత 21-15, 21-12తోటంగ్ను ఓడించింది.