పంచకుల: ఖేలో ఇండియా యువ క్రీడోత్సవాలు హర్యానాలోని పంచకులలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశీయ క్రీడా పోటీలను శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. పది రోజుల పాటు సాగే ఈ పోటీల్లో 25 క్రీడా విభాగాల్లో దాదాపు 5 వేల మంది అథ్లెట్లు పతకాల వేట సాగించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంతస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.