న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఖో-ఖో ప్రపంచకప్ టోర్నీకి భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వబోతున్నది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు ఢిల్లీలో ఖో ఖో ప్రపంచకప్ జరుగుతుందని నిర్వహకులు పేర్కొన్నారు. బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు కార్యక్రమంలో మహారాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ అధికారిక లోగ్తో పాటు ట్యాగ్‌లైన్‌ను విడుదల చేశారు. ఈ మెగాటోర్నీలో మొత్తం పురుషుల, మహిళల జట్లు కలిపి 24 బరిలోకి దిగుతున్నాయి. కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుదాంశు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.