హైదరాబాద్, ఆట ప్రతినిధి : గయా(బీహార్) వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం వేర్వేరు ఈవెంట్లలో రెండు స్వర్ణాలు సహా రెండు కాంస్యాలు దక్కించుకుంది. పురుషుల 200మీటర్ల వ్యక్తిగత మెడ్లె ఈవెంట్లో సుహాస్ ప్రీతమ్ 2:11:00సెకన్ల టైమింగ్‌తో పసిడి దక్కించుకున్నాడు.
అదే దూకుడు కొనసాగిస్తూ 200మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లోనూ సుహాస్ 2:10:56సెకన్లతో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల 200మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీనిత్య 2:24:44 సెకన్లతో స్వర్ణం సొంతం చేసుకుంది. మరోవైపు సైక్లింగ్ కైరిన్ ఈవెంట్లో యువ సైక్లిస్ట్ తనీశ్కుమార్ కాంస్యం దక్కించుకున్నాడు.