Khelo India | శ్రీనగర్: తగినంత మంచు లేకపోవడంతో గత నెలలో వాయిదాపడ్డ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఈనెల 9 నుంచి మొదలుకానున్నాయి. కశ్మీర్లోని గుల్మార్గ్ ఆతిథ్యమిచ్చే ఈ క్రీడలు మార్చి 9 నుంచి 12 వరకు జరుగనున్నాయి.
గుల్మార్గ్లో గత కొన్ని రోజులుగా ఆశించిన మేర మంచు కురుస్తుండటంతో ఈ క్రీడలను నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్ క్రీడా మండలి సిద్ధమైంది. స్కీయింగ్, స్నోబోర్డింగ్లో క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.