Ashes Series : యాషెస్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్. రెండో టెస్టు అయిన పింక్ బాల్(Pink Ball) మ్యాచ్‌కు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) దూరమయ్యాడు. పెర్త్ టెస్టు మధ్యలో వెన్ను నొప్పితో అసౌకర్యంగా కనిపించిన ఖవాజా.. పూర్తిగా కోలుకోకపోవడంతో గబ్బా టెస్టుకు పక్కనపెట్టేశారు. సిరీస్ ఓపెనర్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌కు కూడా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) సేవల్ని కోల్పోయింది. దాంతో.. ఇంగ్లండ్, ఆసీస్‌లు తుది జట్టులో కీలక మార్పులు చేయడం ఖాయమైంది.
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టుకు మరికొన్ని గంటలే ఉంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా డిసెంబర్ 3 నుంచి పింక్ బాల్ డే -నైట్ మ్యాచ్ మొదలవ్వనుంది. సిరీస్ సమం చేయాలనే కసితో ఉన్న ఇంగ్లండ్ తుదిజట్టులో కీలక మార్పులు చేసింది. గాయంతో గబ్బా టెస్టుకు దూరమైన మార్క్ వుడ్ స్థానంలో విధ్వంసక ఆల్‌రౌండర్ విల్ జాక్స్ (Will Jacks)ను తీసుకుంది.
Ben Stokes leads as England make one change to their XI for the second Ashes Test in Brisbane 👊 👀#WTC27 | More on #AUSvENG 📝: https://t.co/zxpQeSbQ2O pic.twitter.com/KEPXCcQqJM
— ICC (@ICC) December 2, 2025
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ఉస్మాన్ ఖవాజా స్థానంలో మరొకరిని స్క్వాడ్‌లోకి తీసుకోలేదు. దాంతో.. మార్నస్ లబూషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇంకా ఫిట్నెస్ సాధించని కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌లు గబ్బా టెస్టుకు అందుబాటులో లేరు. ఫలితంగా.. స్టీవ్ స్మిత్ (Steven Smith) మరోమారు జట్టును నడిపించనున్నాడు. తుది జట్టులోకి జోష్ ఇంగ్లిస్, బ్యూ వెబ్స్టర్లో ఒకరు వచ్చే అవకాశముంది. నిరుడు భారత్‌పైనే అరంగేట్రం చేసిన వెబ్‌స్టర్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.
JUST IN: Usman Khawaja has been ruled out of the second Test at the Gabba after failing to recover from the back spasms that he suffered in the opening match in Perth pic.twitter.com/0wEB1t7oDO
— ESPNcricinfo (@ESPNcricinfo) December 2, 2025