IPL 2025 : ఐపీఎల్లో తిరుగులేని విజయాలతో ఐదు టైటిళ్లు గెలుపొందిన ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి రోహిత్ శర్మ(0) డకౌట్ కాగా.. రియాన్ రికెల్టన్(11)ను ఖలీల్ అహ్మద్ బౌల్డ్ చేసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అశ్విన్ తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ.. డేంజరస్ విల్ జాక్స్(13)ను పెవిలియన్ పంపాడు. అంతే.. చూస్తుండగానే 36 పరుగులకే ముగ్గురు డగౌట్ బాట పట్టారు. ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(19), తిలక్ వర్మ(8)లు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. ఆరు ఓవర్లకు ముంబై స్కోర్.. 52-3.
టాస్ గెలిచిన సీఎస్కేకు వెటరన్ పేసర్ ఖలీల్ అహ్మద్ శుభారంభమిచ్చాడు. నాలుగో బంతికే హిట్‌మ్యాన్ రోహిత్‌ను వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే ధాటిగా ఆడుతున్న రాయన్ రికెల్టన్(11)ను బౌల్డ్ చేసి సీఎస్కే శిబిరంలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు. అయితే.. విల్ జాక్స్(13) సాయంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (19) స్కోర్ బోర్డును నడిపించే బాధ్యత తీసుకున్నాడు.
How’s that for a start #CSK fans? 💛
Khaleel Ahmed strikes twice in the powerplay with huge wickets of Rohit Sharma and Ryan Rickelton 💪
Updates ▶️ https://t.co/QlMj4G6N5s#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/jlAqdehRCq
— IndianPremierLeague (@IPL) March 23, 2025
కానీ, అశ్విన్ చేతికి బంతి ఇచ్చిన రుతురాజ్ ప్రమాదకరమైన జాక్స్ వికెట్ సాధించాడు. దాంతో.. 36కే మూడు కీలక వికెట్లు కోల్పోయింది ముంబై. కష్టమైన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(8) రివర్స్ స్వీప్, స్ట్రెయిట్ డ్రైవ్‌ల ద్వారా రెండు బౌండరీలతో ఒత్తిడిని ఉఫ్ అనిపించాడు. ఆ తర్వాత సూర్య సైతం సిక్సర్‌తో ఖలీల్ లయను దెబ్బతీశాడు. వీళ్లిద్దరు ఇంకో 5-10 ఓవర్లు ఇలానే దూకుడుగా ఆడితే ముంబై పోరాడగలిగే స్కోర్ చేయడం ఖాయం.