హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి చెర్రిపల్లి కీర్తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో అద్భు త ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్న కీర్తనకు ఖేలో ఇండియా అథ్లెట్ స్కీమ్‌లో చోటు దక్కింది.
టాలెంట్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ కమిటీ(టీఐడీసీ) ప్రతిపాదనల్లో భాగంగా దేశవ్యాప్తంగా 62 మంది యువ అథ్లెట్లను గుర్తించగా, అందులో తెలంగాణ నుంచి ఏకైక అథ్లెట్‌గా కీర్తన నిలిచింది. ఖేలో ఇండియా అథ్లెట్ స్కీమ్ కింద అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఎనిమిదేండ్ల పాటు ప్రతి నెల 10 వేల చొప్పున కీర్తనకు ఆర్థిక సాయం లభించనుంది.