Kedar Jadav : అంతర్జాతీయ క్రికెట్ మరో భారత ఆటగాడు వీడ్కోలు పలికాడు. వెటరన్ బ్యాటర్
దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులకు ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్(Kedar Jadav) ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం అతడు సోషల్ మీడియా వేదికగా అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు.
లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) తరహాలోనే జాదవ్ తన వీడ్కోలు సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘నా కెరీర్ ఆసాంతం మద్దుతగా నిలిచి, నాపై ఎంతో ప్రేమ చూపించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ మూడు గంటల నుంచి నేను రిటైరైనట్టు లెక్క’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అంతేకాదు ‘జిందగీ కే సఫర్ మే’ అని హిందీలో కిషోర్ కుమార్(Kishore Kumar) పాడిన పాటను కూడా జాదవ్ పోస్ట్ చేశాడు. 2020 తర్వాత జాదవ్‌కు మళ్లీ నీలి జెర్సీ వేసుకొనే చాన్స్ దక్కలేదు. దాంతో, నాలుగేండ్ల పాటు అవకాశం కోసం నిరీక్షించిన ఈ ఆల్‌రౌండర్ మరో దారి లేక ఆటకు అల్విదా పలికాడు.
జాదవ్ శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) కెప్టెన్సీలో బ్లూ జెర్సీ వేసుకున్న అతడు ఆరేండ్ల కెరీర్లో ఆడింది కొన్ని మ్యాచ్‌లే. 2014 నుంచి 2020 మధ్య టీమిండియాలోకి వచ్చి పోయిన అతడు 73 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడడంతే. అయితే.. దేశవాళీలో మాత్రం జాదవ్‌కు గొప్ప రికార్డు ఉంది. 87 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 6,100 రన్స్ కొట్టాడు.

భారత జట్టు తరఫున ఆడిన జాదవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. మొత్తంగా ఐదు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన జాదవ్ ఆల్‌రౌండర్‌గా రాణించాడు. ఐపీఎల్లో అదరగొట్టిన అతడు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుత పేరు ఢిల్లీ క్యాపిటల్స్), కొచి టస్కర్స్ కేరళ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీల్లో తళుక్కుమన్నాడు.