హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని జరిగిన క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఎమ్ఐసీసీ జట్టు విజేతగా నిలిచింది. ఆర్టీఐ కమిషనర్ మహమ్మద్ ఆమీర్ నేతృత్వంలో గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఎమ్ఐసీసీ ఆరు వికెట్ల తేడాతో రాయల్ హిట్టర్స్పై గెలిచింది. తొలుత రాయల్ హిట్టర్స్ నిర్ణీత ఐదు ఓవర్లలో 53/4 స్కోరు చేయగా, లక్ష్యఛేదనలో ఎమ్ఐసీసీ 4.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. విజేతకు లక్ష, రన్నరప్‌నకు రూ.50వేలు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు ఆర్టీఐ కమిషనర్ ఆమీర్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, గజ్జెల నగేశ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్‌గౌడ్, ఉపేంద్ర పాల్గొన్నారు.