KC Cariappa : భారత స్పిన్నర్ కేసీ కరియప్ప (KC Cariappa) సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. జాతీయ జట్టుకు ఆడాలన్న కల నెరవేరకుండానే అతడు భారత క్రికెట్ నుంచి వైదొలిగాడు. కర్నాటక జట్టు తరఫున దేశవాళీలో గొప్ప ప్రదర్శన అతడు అవకాశాల కోసం నిరీక్షించాడు. కానీ, టీమిండియాకు ఆడాలనే అతడి స్వప్నం సాకారమవ్వలేదు. అటు ఐపీఎల్‌లోనూ ఎవరూ కొనలేదు. దాంతో.. సోమవారం నుంచి భారత క్రికెట్‌కు అల్విదా పలుకుతున్నానని చెప్పాడు.
దేశవాళీ క్రికెట్లో తానేంటో నిరూపించుకున్న కరియప్ప.. గూగ్లీ, క్యారమ్ బాల్స్ వేయడంలో ఆరితేరాడు. ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో అతడి కెరీర్ ఏంతగొప్పగా సాగలేదు. లెగ్ స్పిన్నర్‌గా వైవిధ్యం చూపగల సత్తా ఉన్నప్పటికీ దేశవాళీ, ఐపీఎల్‌కే మాత్రమే పరితమమయ్యాడు. ‘వీధుల నుంచి స్టేడియంలో ఆడడం, పలు జట్ల జెర్సీ ధరించడం గర్వంగా అనిపించింది. నేను ఒకప్పుడు కన్న కలను నిజం చేసుకున్నాను.
🚨 KC Cariappa announces retirement from Indian cricket 🚨
Represented KKR, PBKS & RR in the IPL 🏏
A journey to be proud of 👏#KCCariappa #Retirement #IndianCricket #IPL pic.twitter.com/qkLhFbPxmc— Mumbai_Manikbhai (@mumbaimanik) January 12, 2026
ఈరోజు నుంచి భారత క్రికెట్ నుంచి నేను వైదొలుగుతున్నా. ఈ సుదీర్ఘ ప్రయాణం నాకు ఎన్నో ఇచ్చింది. విజయాలు నన్ను నవ్వించాయి. ఓటములు నన్ను కుంగదీశాయి. మొత్తంగా చాలా పాఠాలు నేర్చుకున్నా. వ్యక్తిగా ఎంతో మెరుగయ్యాను. నాపై నమ్మకముంచి.. నన్ను ప్రోత్సహినందుకు కర్నాటక క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు. నన్నొక కుటుంబ సభ్యుడిలా భావించి.. నాకు మద్దతు ఇచ్చినందుకు మిజోరాం క్రికెట్ సంఘానికి కూడా కృతజ్ఞతలు’ అని కరియప్ప పేర్కొన్నాడు. భారత క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన అతడు విదేశీ లీగ్స్‌లో ఆడే అవకాశముంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కర్నాటక తరఫున విశేషంగా రాణించిన కరియప్ప ఐపీఎల్(IPL)లోనూ మెరిశాడు. 2015లో అతడి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అతడి ఐపీఎల్ కెరీర్ మొదలైంది. సీనియర్ జట్టుకు ఆడిన అనుభవం లేకున్నా ఈ లెగ్ స్పిన్నర్‌ను రూ.2.4 కోట్లకు కొన్నది ఫ్రాంచైజీ.
ఆ తర్వాతి సీజన్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2021 సీజన్లో ఈ లెగ్ బ్రేక్ బౌలర్‌ను రూ.20 లక్షలకు కొన్నది. పంతొమ్మిదో సీజన్ వేలంలో ఈ స్పిన్నర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనలేదు. దాంతో.. రిటైర్మెంట్ ప్రకటించేశాడు. మొత్తంగా 11 ఐపీఎల్ మ్యాచుల్లో 8 వికెట్లు తీశాడంతే. 14 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 75 వికెట్లు.. ఇక టీ20 కెరీర్లో 1,000 రన్స్ సాధించాడు.