Tharun Mannepalli | అస్తానా: కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్‌లో భారత షటర్ల జోరు కొ నసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. సెమీస్‌లో తరుణ్.. 21-8, 21-7 తేడాతో వియాత్నాంకు చెందిన లి డుసి ఫట్ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ 24-22, 21-16 తేడాతో జపాన్ క్రీడాకారిణి సొరనొ యోషికవాను ఓడించింది. ఫైనల్లో ఆమె భారత్‌కే చెందిన ఇషారాణితో తలపడుతుంది.