Kavya Maran | ఐపీఎల్17వ సీజన్ ప్రారంభం నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత ఆటతీరుతో పరుగుల వరద పారిస్తూ రికార్డులు నమోదు చేసింది. ఆరేళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోల్‌కతా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. సన్‌రైజర్స్ జట్టు రన్నరప్‌గా సరిపెట్టుకుంది. సన్ రైజర్స్ జట్టు కో ఓనర్ కావ్య మారన్ మ్యాచ్ పూర్తి కాగానే కంటతడిపెట్టారు. అయితే, బాధలో కావ్య ఆటగాళ్లను ఓదారుస్తూ అందరి మనసులను గెలిచింది.
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన కావ్య మారన్ నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఉత్సాహపరించేందుకు ప్రయత్నించింది. ‘మీరు నిజంగా మమ్మల్ని ఎంతో గర్వించేలా చేశారు. టీ20 క్రికెట్ ఆడే విధానాన్ని మీరు పునః నిర్వమించారు. ఐపీఎల్లో ప్రతి ఒక్కరూ సన్ రైజర్స్ జట్టు గురించి మాట్లాడేలా చేశారు. కానీ, ఈ రోజు మనది కాదు. అంతే కానీ టోర్నీలో మీరు ఎంతో చక్కగా ఆడారు. బ్యాట్‌తో, బంతితో మీరు చేసిన ప్రదర్శన అమోఘం. అందరికీ కృతజ్ఞతలు.
గత సీజన్ లో చివరి స్థానంలో నిలిచినప్పటికీ, ఈ సీజన్లో మన అభిమానులు పెద్దసంఖ్యలో మైదానాలకు వచ్చారంటే.. దానికి కారణం మీరే. కేకేఆర్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచినా ప్రతి ఒక్కరూ సన్ రైజర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇకపై సన్ రైజర్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ టోర్నీలో మనం ఆడిన ఆట అలాంటిది. ఎవరూ నిరుత్సాహపడవద్దు. మనం ఫైనల్స్ దాకా చేరాం. ఇది కూడా ఇతర మ్యాచులవంటిదే. ఇవాళ ఇతర టీంలు మన ఆటను చూస్తూ ఉండి ఉంటాయి. అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ కలుసుకుందాం’ అంటూ కావ్య డ్రెసింగ్ రూమ్‌లో సందేశాన్ని వినిపించింది.
“You’ve made us proud.” 🧡
– Kaviya Maran pic.twitter.com/zMZraivXEE
— SunRisers Hyderabad (@SunRisers) May 27, 2024