కౌర్‌సింగ్ కన్నుమూత
భారత బాక్సింగ్ దిగ్గజం కౌర్‌సింగ్(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న సింగ్ గురువారం తుదిశ్వాస విడిచారు. తన అద్భుత నైపుణ్యంతో బాక్సింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టారు. న్యూఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో కౌర్ పసిడి పతకంతో చరిత్ర సృష్టించారు.
- అలీతో ఢీ అంటే ఢీ అన్న బాక్సింగ్ దిగ్గజం
చండీగఢ్ : భారత బాక్సింగ్ దిగ్గజం కౌర్‌సింగ్(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న సింగ్ గురువారం తుదిశ్వాస విడిచారు. తన అద్భుత నైపుణ్యంతో బాక్సింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టారు. న్యూఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో కౌర్ పసిడి పతకంతో చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ఆరు పసిడి పతకాలు సాధించిన ఈ వెటరన్ బాక్సర్ ఒలింపిక్స్‌లోనూ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.
దీనికి తోడు తన పంచ్ పవర్‌తో ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మద్ అలీతో 1980లో ఎగ్జిబిషన్ బౌట్లో సింగ్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డారు. సింగ్ సాధించిన ఘనతలకు తగిన విధంగా అర్జున(1982), పద్మశ్రీ (1983), విశిష్ట సేవా మెడల్ (1988) పురస్కారాలు అందుకున్నారు. సింగ్ మృతి పట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతాపం వ్యక్తం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

