సిటీబ్యూరో: వాయుగుండం ప్రభావంతో శుక్రవారం నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 10గంటల వరకు కూకట్పల్లిలోని హైదర్నగర్లో 1.5సెం.మీలు, జింఖాన, బోయిన్పల్లి, రహ్మత్నగర్లో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో రాగల 48 గంటల్లో నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28.7, కనిష్ఠం 23.4 డిగ్రీలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.