కాటారం, జనవరి 31: జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు కాటారం గిరిజన సంక్షేమ కళాశాల విద్యార్థి ఎంపికయ్యాడు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ ఖో-ఖో చాంపియన్షిప్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా జట్టు తరఫున పాల్గొన్న అరవింద్ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా ఖో-ఖో అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి వేల్పుల కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు హర్యానాలో జరుగనున్న పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.