Karun Nair | టీమిండియా మాజీ ఆటగాడు కరుణ్ నాయర్ దాదాపుగా మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చారు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1076 రోజుల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్‌ల కరుణ్ నాయర్ 89 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. 33 ఏళ్ల బ్యాట్స్‌మన్ 22 బంతుల్లో తన ఐపీఎల్ కెరీర్లో 11వ హాఫ్ సెంచరీని సాధించాడు. ఆరు సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్లో కరుణ్ నాయర్ అర్ధ సెంచరీ చేయడం విశేషం.
ఇటీవల ఫుల్ ఫామ్‌లో ఉన్న కరుణ్ 40 బంతుల్లో 12 ఫోర్లు, ఐదు భారీ సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేశాడు. 222.50 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన బ్యాట్స్‌మెన్ సాధించిన రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. గత సీజన్లో లక్నోపై 68 పరుగులు చేసిన రోహిత్ శర్మను వెనక్కి నెట్టి రెండోస్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో జోస్ బట్లర్ అగ్రస్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున గతేడాది కోల్‌కతాపై జోస్ బట్లర్ అజేయంగా 107 నాటౌట్‌గా నిలిచాడు.
ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కరుణ్ నాయన్ ఇటీవల దేశీయ క్రికెట్లోనూ ఫుల్ ఫామ్‌లో కొనసాగించాడు. గత దేశీయ సీజన్లో తొమ్మిది సెంచరీలు చేశాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. బుమ్రా వేసిన తొమ్మిది బంతులను ఆడి 26 పరుగులు చేశాడు. ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2016లో శిఖర్ ధావన్ 16 బంతుల్లో 27 పరుగులు చేశాడు.
ఆదివారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించినా.. మిగతా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ మొదట ముంబయిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లో 193 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆరుగు బ్యాటర్లు కేవలం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. ముంబయి బౌలర్ల్ కరణ్ శర్మ, మిచెల్ శాంటర్నర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబయి 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.