హైదరాబాద్: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయికార్తీక్రెడ్డి అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ట్యునీషియా వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో కార్తీక్‌రెడ్డి, పరీక్షిత్ సోమానీ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో కార్తీక్, పరీక్షిత్ ద్వయం 6-7(6/8), 7-5, 10-5తో మాక్సిమస్ జోన్స్, కరణ్‌సింగ్ జోడీపై విజయం సాధించింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన భారత జోడీ పుంజుకుని వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది.