Purushaha | బ్రహ్మచారి భర్తయితే యుద్ధ భూమిగా జీవితం.. క్యూరియాసిటీ పెంచుతున్న పురుష ఫస్ట్ లుక్ పోస్టర్
Purushaha | స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన పురుష (Purushaha) లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నేడు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పురుష ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశాడు.
Purushaha | ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది.. అంటూ పురుష (Purushaha) సినిమాతో ఎంట్రీ ఇస్తూ అందరి ఫోకస్ తనవైపు తిప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. వీరు వులవల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా నేడు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పురుష ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశాడు. ఇందులో పవన్ కల్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తున్నారు. బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధ భూమిగా మారుతుంది.. అంటూ విడుదల చేసిన పోస్టర్లలో పవన్ కల్యాణ్ యుద్ద వీరుడి గెటప్‌లో కనిపిస్తుంటే.. కసిరెడ్డి కసిరెడ్డి రాజ్‌కుమార్ స్పైడర్ మ్యాన్‌గా, సప్తగిరి దేవదూతను తలపించే గెటప్‌లో కనిపిస్తున్నారు. ఒకరి డ్రెస్‌పై ఎగిరి పక్షి బొమ్మ కనిపిస్తుంటే.. మరొకరి చాతిపై లవ్ సింబర్.. ఇంకొకరిపై కత్తెర సింబల్ కనిపిస్తున్నాయి. మొత్తానికి బ్రహ్మచారి భర్తగా మారిన తర్వాత కదనరంగంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో ఫన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఫస్ట్ లుక్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. కామెడీ జోనర్లో వస్తోన్న వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
The first look of #Purushaha is here. Launched by @odela_srikanth , it’s totally worth it! 💥@kalyanb949 @urvaishukrish@VeeruVulavala #SatishMutyala@urvaishukrish @Actor_Rajkumar9@MeSapthagiri @vennelakishore@vtvganeshoff #PammiSai#Vishika #HassiniSudhir#ShravanBharadwaj… pic.twitter.com/2l909T6SfT
— Vamsi Kaka (@vamsikaka) November 5, 2025
Read Also :
Dies Irae | మోహన్‌లాల్ కొడుకు కొత్త మూవీ.. ‘డీయాస్ ఈరే’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Peddi First Single | ‘పెద్ది’ అప్డేట్ వచ్చేసింది.. ‘చికిరి’ వీడియో పంచుకున్న టీమ్
Mira Nair Son | న్యూయార్క్ మేయర్‌గా భారతీయ దర్శకురాలి కొడుకు.. ఎవరీ జోహ్రాన్ మమ్దానీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

