హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నీలో రాష్ట్రానికి చెందిన కర్రా శివానీ, నందిగమ్ శివకుమారి సత్తాచాటారు.
ఆదివారం జరిగిన బాలికల 50మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో శివానీ 31.98సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా, శివకుమారి 33.56సెకన్లతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడ్డ శ్రేయా బినిల్ 31.67సెకన్లతో స్వర్ణం సొంతం చేసుకుంది.