IPL Tickets : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు రేపటితో తెరలేవనుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌తో మెగా టోర్నీ మొదలవ్వనుంది. ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అమ్ముడవ్వగా.. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల కోసం కర్నాటక క్రికెట్ సంఘం (KSCA) కీలక నిర్ణయం తీసుకుంది. మేము వీఐపీలం, ఐపీఎల్ టికెట్లు మాకు ఇవ్వరా? అని బెదిరించినందున సమస్యను పెద్దది చేయడం ఇష్టంలేక ఉచితంగా టికెట్లు ఇవ్వాలని తీర్మానించింది. శుక్రవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసిన కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ వివాదానికి తెరదించాడు.
‘మేము వీఐపీలం. ఐపీఎల్ టికెట్ల కోసం క్యూలో నిల్చోవాలా?’ అని ప్రశ్నించిన కర్నాటక ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకున్నారు. తమకు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు ఇవ్వాలని, మైదానంలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని వీరు చేసిన డిమాండ్లకు కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అంగీకరించింది. ఎమ్మెల్యేల బెదిరింపుల నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)ను కలిశాడు కేఎస్‌సీఏ అధ్యక్షడు వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad). ఐపీఎల్ ఆరంభ వేడుకకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. అంతేకాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రికి వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.
Karnataka Elected Representatives to Get Two IPL Tickets, Confirms Deputy CM Shivakumar
Bengaluru
After legislators across party lines, #Congress, #BJP and #JDS, demanded four complimentary tickets per #IPL match at M. Chinnaswamy Stadium, Karnataka Deputy Chief Minister D.K.… https://t.co/mGnwyJ0GIw pic.twitter.com/PaHUVnvylU
— Yasir Mushtaq (@path2shah) March 27, 2026
ఈ వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నాలుగు టికెట్లు ఇవ్వాలని స్పీకర్ కోరారు. కానీ, ఇప్పటికే మ్యాచ్ టికెట్లు అమ్ముడయ్యాయి. రేపే మ్యాచ్ జరుగనున్నందున టికెట్ల సర్దుబాటుకు సమయం కూడా లేదు. టికెట్లు ఆశిస్తున్న ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. వీరికి ఒకటే టికెట్ దక్కనుంది. అయితే.. కుటుంబంతో సహా వెళ్లేందుకు వీలుగా ఒక్కొక్కరికి రెండేసీ ఇవ్వాలని కర్నాటక క్రికెట్ సంఘం, ఆర్సీబీ కొత్త యాజమాన్యాన్ని అభ్యర్థించాను’ అని అన్నారు.
#WATCH | Bengaluru: On State MLAs’ demand for IPL tickets, Karnataka Deputy CM DK Shivakumar says, “…Four tickets can’t be given. So, every MLA, MP and Minister used to get one seat each. Now, we have requested them to give two tickets if the family members go. For tomorrow’s… pic.twitter.com/1bA5wUNAnc
— ANI (@ANI) March 27, 2026
ఐపీఎల్ టికెట్ల కోసం కర్నాటకలో రగడ మొదలైంది. హుంగుండ్ శాసనసభ్యుడైన విజయానంద్ కషపనవర్ కర్నాటక క్రికెట్ సంఘానికి టికెట్ల గురించి కొన్ని ఆదేశాలిచ్చారు. మార్చి 28న ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులకు కర్నాటక క్రికెట సంఘం టికెట్లు ఇవ్వడం లేదు. కానీ, ప్రభుత్వం నుంచి కేఎస్‌సీఏ అన్నిరకాల ప్రయోజనాలు పొందుతోంది. అయినా కర్నాటక క్రికెట్ సంఘం ఎమ్మెల్యేలను మాత్రం గౌరవించడం లేదు. అందుకని మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఐపీఎల్ టికెట్ల విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో లేవనెత్తారు. నేను వారి ప్రతిపాదనకు అంగీకరిస్తున్నా.
Karnataka MLA -KSCA | ‘మేము వీఐపీలం.. ఐపీఎల్ టికెట్ల కోసం క్యూలో నిల్చోవాలా’?https://t.co/Dfg7DQmmqG
— Namasthe Telangana (@ntdailyonline) March 26, 2026
ఎమ్మెల్యేలకు కనీసం ఐదు టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరాను అని విజయానంద్ తెలిపారు. అంతేకాదు మైదానంలో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మేము వీఐపీలం. అందరిలా మేము ఐపీఎల్ టికెట్ల కోసం క్యూలో నిల్చోలేం. మేము గత సీజన్లో ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాం. చాలాసేపు క్యూలో నిల్చున్నాం. సాధారణ ప్రజల మాదిరిగానే మమ్మల్ని గ్యాలరీలోకి పంపించారు. ఈసారి అలా జరగదు అని ఆయన కర్నాటక క్రికెట్ సంఘం తీరుపై విమర్శలు గుప్పించారు.