Kapil Dev : ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు ‘షేక్ హ్యాండ్’పై చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఎలాగైనా రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycraft)ను తప్పించేలా చేసి.. తమ పంతం నెగ్గించుకోవాలని ఆ దేశ బోర్డు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఐసీసీ అవేవీ కుదరవు అని స్పష్టం చేయడంతో పీసీబీ బాయ్‌కాట్ అస్త్రం బెడిసికొట్టింది. హ్యాండ్ షేక్ వ్యవహారాన్ని పాక్ పెద్దది చేయడంపై భారత దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) అసహనం వ్యక్తం చేశాడు. వివాదాలపై కాకుండా క్రికెట్‌పై దృష్టి సారించాలని కపిల్ దాయది జట్టుకు సూచించాడు.
షేక్ హ్యాండ్ వివాదంపై స్పందించాడు కపిల్. భారత ఆటగాళ్లు కరచాలనం ఇవ్వకపోవడాన్ని పాక్ ఆటగాళ్లు, ఆ దేశ బోర్డు భూతద్దంలో చూడడాన్ని భారత వరల్డ్ కప్ హీరో తప్పుపట్టాడు. ‘క్రికెట్లో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది చాలా చిన్న విషయం. అది ఆటగాళ్ల వ్యక్తిగత ఇష్టం. అందుకే మైదానంలో జరిగిన విషయాలపై కాకుండా ఆటగాళ్లు క్రికెట్‌పై దృష్టి సారించాలి. ఒకవేళ ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వకుంటే ఆ విషయాన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదు.
Kapil Dev बोले- Handshake विवाद को इतना बड़ा मुद्दा नहीं बनाना चाहिए था#KapilDev #AsiaCup2025 #AsiaCup #INDvsPAK #INDvsPAK #NoHandshake pic.twitter.com/KiUCQSWuZk
— Asianetnews Hindi (@AsianetNewsHN) September 18, 2025
అలానే వాళ్లపై ఆరోపణలు చేయడం, తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వంటివి సరికాదు. ఇప్పటికైనా పాక్ జట్టు ప్రతిదాన్ని వివాదం చేయకుండా ఆటపై ఫోకస్ పెట్టాలి’ అని కపిల్ పాక్ ఆటగాళ్లకు సూచించాడు. లీగ్ దశలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాక్ జట్టు. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై గెలుపొంది సూపర్ 4లో అడుగుపెట్టింది సల్మాన్ అఘా టీమ్. ఆదివారం ఫైనల్ బెర్తు కోసం భారత్, పాక్ అమీతుమీకి సిద్ధమవుతున్నాయి.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ జట్లు తొలిసారి ఆసియా కప్‌లో ఎదురుపడ్డాయి. ఎప్పటిలానే దాయాదిని చిత్తుగా ఓడించిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు జట్టు సభ్యులకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దాంతో.. ఈ వ్యవహారాన్ని పెద్ద రాద్దాంతం చేసింది పాక్ క్రికెట్ బోర్డు. టాస్ సమయంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చొరవ చూపకపోవడం వల్లనే టీమిండియా కెప్టెన్ సూర్య.. తమ నాయకుడు సల్మాన్ అఘాతో కరచాలనం చేయలేదని దుయ్యబట్టింది.
𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐬𝐮𝐩𝐫𝐞𝐦𝐚𝐜𝐲 𝐨𝐯𝐞𝐫 𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧 𝐢𝐧 𝐦𝐚𝐣𝐨𝐫 𝐦𝐚𝐭𝐜𝐡𝐞𝐬 𝐜𝐨𝐧𝐭𝐢𝐧𝐮𝐞𝐬. 🇮🇳🔥#INDvsPAK #AsiaCup #Cricket #Sportskeeda pic.twitter.com/xSvH3pXfsI
— Sportskeeda (@Sportskeeda) September 15, 2025
వచ్చే మ్యాచ్‌కు తమకు కొత్త రిఫరీని కేటాయించుకుంటే తమ జట్టు టోర్నీ నుంచి వైదొలుగుతుందని ఆ దేశ బోర్డు బీరాలు పలికింది. కానీ, ఐసీసీ మాత్రం మీ ఇష్టం. ఆడితే ఆడండి లేకుంటే లేదు.. రిఫరీ ఆండీని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దాంతో.. యూఈఏతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని భావించిన పాక్.. టాస్ వేళకు మైదానం చేరుకోలేదు. మరోసారి ఐసీసీకి లేఖ రాసి తమకు వేరే రిఫరీని కేటాయించాలని కోరింది. అయినా సరే అస్సలు కుదరదని జై షా నేతృత్వంలోని ఐసీసీ కరాఖండీగా చెప్పేసింది. దాంతో.. చేసేదేమీ లేక ఉసూరుమంటూ అబుదాబీ స్టేడియం చేరుకుంది పాక్ జట్టు.