వాషింగ్టన్ : అమెరికాలో ప్రస్తుతం క్రికెట్ బాల్య దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఉచ్ఛదశకు చేరుకుంటుందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేశ్ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఈ యేడాది సెప్టెంబర్‌లో అమెరికాలో నిర్వహించనున్న అమెరికన్ యూనిటీ క్రికెట్ లీగ్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కపిల్‌దేవ్ మాట్లాడుతూ భవిష్యత్తులో అమెరికా క్రికెట్లో ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదుగుతుందన్నాడు. ఈ కార్యక్రమంలో రోడ్ ఐలాండ్ గవర్నర్‌తోపాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొని క్రికెట్ ఆడి సందడి చేశారు.