Danish Kaneria : పాకిస్థా్న్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) తమ దేశంలోని హిందువుల పక్షాన గొంతు వినిపిస్తుంటాడు. అంతేనా.. తమదేశంలో అల్ప సంఖ్యాకులపై జరుగుతున్న దాడుల్నిప్రశ్నించే అతడు భారతదేశ ధర్మాన్ని కొనియాడుతూ.. శ్రీరాముడిని ఆరాధిస్తూ పోస్టులు పెడుతుంటాడు. ఈమధ్య అతడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)ను ప్రశంసించడంపై పాక్‌లో పెద్ద దుమారం రేగింది. భారతీయ పౌరసత్వం (Indian Citizenship) కోసమే మాజీ లెగ్ స్పిన్నర్ ఇదంతా చేస్తున్నాడనే పలువురు కనేరియాను విమర్శించారు. దాంతో.. తనపై వస్తున్న ఆరోపణలు, అసత్య కథనాలకు అతడు ఎక్స్ పోస్ట్‌తో చెక్ పెట్టాడు.
తానేమీ భారత పౌరసత్వం ఆశించి అంతర్గత వ్యవహారాలపై స్పందించలేదని, అసలు తనకు అలాంటి ఉద్దేశమే లేదని వెల్లడించాడీ వెటరన్ స్పిన్నర్. ‘చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను పాకిస్థాన్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతున్నారు. భారతదేశ అంతర్గత విషయాలపై ఎందుకు కామెంట్లు చేస్తున్నారని నిలదీస్తున్నారు. అంతేకాదు కొందరైతే నేను ఇవన్నీ భారత పౌరసత్వం కోసమే చేస్తున్నానే వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. అందుకే.. మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. పాకిస్థాన్ నుంచి, ఆ దేశ ప్రజల నుంచి నేను చాలా ప్రేమను పొందాను.
Lately, I have seen many people questioning me, asking why I do not speak about Pakistan, why I comment on Bharat’s internal matters, and some even alleging that I do all this for Bharatiya citizenship. I feel it is important to set the record straight.
From Pakistan and its…
— Danish Kaneria (@DanishKaneria61) October 4, 2025
అదే సమయంలో పాకిస్థాన్ అధికారులు, పాక్ క్రికెట్ బోర్డు నుంచి తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు నన్ను మతం మారాలని బలవంతం చేశారు. భారత పౌరసత్వం గురించి నాకు స్పష్టత ఉంది. పాకిస్థాన్ నాకు జన్మభూమి కావచ్చు. కానీ, భారత్ నాకు మాతృభూమి. మా పూర్వీకులకు చెందిన దేశం. నా దృష్టిలో భారత్ ఒక దేవాలయం. ప్రస్తుతానికైతే నాకు ఆ దేశ పౌరసత్వం తీసుకోవాలనే ఆలోచన అయితే లేదు.
కానీ, మాలాంటి వాళ్ల కోసం సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA) ఉండనే ఉంది. అందుకే.. నన్ను విమర్శించేవాళ్లకు ఒకటే చెబుతున్నా.. నేను భారత పౌరసత్వం ఆశించి ఆర్ఎస్ఎస్ను ప్రశంసించడం వంటివి చేస్తున్నానడం పచ్చి అబద్ధం. నేను ఎల్లప్పుడూ ధర్మం వైపు నిలబడుతాను. సమాజాన్ని విడదీయాలని చూసే దేశ ద్రోహులను, కపట లౌకిక వాదుల గురించి అందరికీ తెలియజేస్తాను. నా భద్రత గురించి ఆందోళన చెందవద్దు. శ్రీరాముడి ఆశీర్వాదంతో నేను, నా కుటంబం క్షేమంగా ఉన్నాం. నా విధి, భవితవ్యం అనేవి ఆ రాముడి చేతుల్లోనే ఉన్నాయి’ అని కనేరియా తన సుదీర్ఘ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
The government should not care about pseudo secularists and must focus on empowering RSS and its volunteers. Indira Jaisingh and others thrived with past govt support, and that is why their ecosystem is strong enough today to vilify nationalist organisations. https://t.co/zyPNKsIkFJ
— Danish Kaneria (@DanishKaneria61) October 4, 2025
ఈమధ్యే కనేరియా ‘శతాబ్ది ఉత్సవాల’ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను ప్రశంసించాడు. ప్రపంచానికి ఇలాంటి నిబద్ధత కలిగిన సంస్థలు అవసరమని అతడు అన్నాడు. దాంతో.. కనేరియాపై పాక్‌లో తీవ్ర విమర్శలు వచ్చాయి. పాక్ క్రికెట్ జట్టుకు ఆడిన తొలి హిందువుగా గుర్తింపు సాధించిన కనేరియా కెరీర్ ఆసాంతం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. 2000 నుంచి 2010 వరకూ ప్రాతినిధ్యం వహించిన ఈ లెగ్ స్పిన్నర్ టెస్టుల్లో 231 వికెట్లు పడగొట్టాడు.