న్యూఢిల్లీ: యువ ఆటగాడు యష్ ధుల్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో బరిలోకి దిగే భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 23 నుంచి శ్రీలంకలో జరుగనున్న ఈ టోర్నీకి బీసీసీఐ మంగళవారం జట్టును ప్రకటించింది.
ఇందులో తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి చోటు దక్కించుకున్నాడు. అండర్-23 ఆటగాళ్లు పాల్గొననున్న ఈ టోర్నీలో ఐపీఎల్లో సెంచరీ నమోదు చేసిన ప్రభ్‌సిమ్రన్ సింగ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రాజ్వర్ధన్, ధ్రువ్ జురెల్, హర్షిత్ తదితరులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. నేపాల్, యూఏఈ, పాకిస్థాన్‌తో కలిసి భారత జట్టు గ్రూప్-‘బి’లో పోటీపడుతున్నది.