కొత్తపల్లి, ఆగస్టు 20: రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో చాంపియన్షిప్లో వరంగల్ అర్బన్ జట్టు విజేతగా నిలిచింది. కరీంగనర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో వరంగల్ అగ్రస్థానం కైవసం చేసుకోగా.. హైదరాబాద్, అదిలాబాద్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. టోర్నీ లో సత్తాచాటిన వాళ్లు ఈ నెల 28 నుంచి న్యూఢిల్లీలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.