Squash World Cup : భారత క్రీడాకారులు విశ్వవేదికపై మెరవడం కొత్తేమీ కాదు. టెన్నిస్, బ్యాడ్మింటన్‌లోనూ అంతర్జాతీయ పతకాలు సాధించారు మనోళ్లు. అయితే.. స్క్వాష్ (Squash) ఆటలో మాత్రం ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్‌ను తొలిసారి ఒడిసిపట్టింది మన జట్టు. ఆ గేమ్ చరిత్రలో మొట్టమొదటిసారి వరల్డ్ ఛాంపియన్‌గా అవవతరించింది భారత బృందం. ఆదివారం జరిగిన ఫైనల్లో 3-0తో హాంకాంగ్‌ను చిత్తు చేసిన జోష్న, అభ్యయ్, అనాహత్ టీమ్ స్క్వాష్‌లో నవ శకానికి నాంది పలికారు.
స్క్వాష్ ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ ఆడిన భారత బృందం సంచలన ఆటతో విజేతగా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులకు చెక్ పెడుతూ వచ్చిన జోష్నా చిన్నప్ప, అభయ్ సింగ్, అనాహత్ సింగ్ బృందం.. ఫైనల్లోనూ జోరు చూపి హాంకాంగ్‌కు చెక్ పెట్టింది. చెన్నైలో జరిగిన ప్రపంచకప్‌లో సొంత ప్రేక్షకుల మద్దతుతో గొప్పగా ఆడిన ఈ త్రయం సరికొత్త చరిత్ర లిఖించింది. గతంలో కాంస్యంతోనే సరిపెట్టుకున్న భారత్‌ను విశ్వ విజేతగా నిలిపారీ యువకెరటాలు.
🔥🔥 HISTORIC DAY FOR INDIAN SQUASH🔥🔥
🏆TEAM INDIA IS THE CHAMPION OF THE SQUASH WORLD CUP
Second-seeded India defeated the top-seeded Hong Kong 3-0 to win the Squash World Cup for the first time.
Former World Top 10 Joshna Chinappa defeated WR37 Ka Yi Lee🇭🇰 3-1 (7-3, 2-7,… pic.twitter.com/Vn18u0vYxQ
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) December 14, 2025
ఫైనల్లో జోష్నా జట్టుకు తొలి విజయం అందించింది. 97వ ర్యాంకర్ జోష్నా ప్రత్యర్ధి కా యూ లీపై 7-3, 2-7, 7-5, 7-1తో గెలుపొందింది. ఆమె విజయంతో స్ఫూర్తి పొందిన అభయ్ 7-1, 7-4, 74తో అలెక్స్ లా, అనాహత్ 7-2, 7-2, 7-5తో టొమాటో హోపై విజయంతో కప్ కొల్లగొట్టింది భారత బృందం. ఇది మాకు చాలా పెద్ద విజయం. టోర్నీలో ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు ఆడాం. సెమీఫైనల్లో ఈజిప్టుపై, ఫైనల్లో హాంకాంగ్‌పై ఒత్తిడిని ఎదుర్కొన్నాం. అయితే.. జట్టుకు అవసరమైన ప్రతిసారి ఈ ముగ్గురు గొప్పగా ఆడారు అని కోచ్ హరీందర్ సింగ్ తెలిపాడు.