బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ప్రధాన పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా టీమ్ఇండియాతో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ అస్ట్రేలియా (సీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గబ్బా టెస్టు నాలుగో రోజు ఆటలో బౌలింగ్‌కు దిగిన హాజిల్‌వుడ్ ఆట మధ్యలోనే కాలిపిక్క నొప్పితో పెవిలియన్ చేరాడు. గాయం తీవ్రతను అంచనా వేసేందుకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు హాజిల్‌వుడ్ అందుబాటులో ఉండే చాన్స్ లేదని ఆసీస్ సహయక కోచ్ వెటోరీ తెలిపాడు. హాజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ జట్టులోకి రానున్నాడు.