RCB | లక్నో: ప్లేఆఫ్స్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ లక్నోలో జట్టుతో కలిశాడు.
భారత్-పాక్ దేశాల ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడటంతో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన ఈ ఆసీస్ పేసర్ తిరిగి రావడం కష్టమేనని అనుకున్నా.. ఎట్టకేలకు అతడు జట్టుతో కలవడంతో బెంగళూరు బౌలింగ్ విభాగం పటిష్టమైంది.