ICC : ప్లేయర్ ఆఫ్ ది మంత్ నవంబర్- 2022 అవార్డులను ఐసీసీ సోమవారం ప్రకటించింది. మెన్స్ విభాగంలో ఇంగ్లండ్ వన్డే, టీ 20 జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఈ అవార్డు అందుకున్నాడు. మహిళల విభాగంలో పాకిస్థాన్‌కు చెందిన సిద్రా అమీన్ ఎంపికైంది. విమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచిన రెండో పాక్ క్రికెటర్‌గా అమీన్ గుర్తింపు సాధించింది. పాక్ ఆల్‌రౌండర్ నిదా దార్ అక్టోబర్ నెలలో ఈ అవార్డును అందుకుంది. బట్లర్ ఐసీసీ ప్లేయర్ ఆప్ ది మంత్‌గా సెలక్ట్ కావడం ఇదే మొదటిసారి. టీ 20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడడమే కాకుండా ఇంగ్లండ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంతో బట్లర్ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు నవంబర్ నెలలో అతను నాలుగు టీ20 మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సిద్రా అమీన్ 227 రన్స్ చేసింది. దాంతో, పాక్ వన్డే సిరీస్ గెలవడంలో అమీన్ కీలక పాత్ర పోషించింది.
నవంబర్ నెలకు గానూ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం జోస్ బట్లర్, ఆదిల్ రషీద్, పాకిస్థాన్ పేసర్ షాహీన్ ఆఫ్రీది నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో ఈ అవార్డు కోసం సిద్రా అమీన్, ఐర్లాండ్‌కు చెందిన గాబీ లెవిస్, నెదర్యాండ్స్ ప్లేయర్ నాథకన్ చంథమ్ పోటీ పడ్డారు. అవార్డును ఎక్కువ ఓట్లు వచ్చిన ఆటగాళ్లకు ఇస్తారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యులు, మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు, ఐసీసీ వెబ్సైట్ (icc-cricket.com.)లో రిజిష్టర్ అయిన అభిమానులు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు.