ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో మరో శతకం నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ మెరుపు సెంచరీ సాధించాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 100 మార్క్ చేరుకున్నాడు.ఆరంభం నుంచి సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడిన బట్లర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్ధశతకం పూర్తైన తర్వాత బట్లర్ బౌండరీల వర్షం కురిపించాడు.
మైదానం నలువైపులా తనదైన స్టైల్లో పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ శాంసన్(48) అర్ధశతకానికి చేరువలో ఔటయ్యాడు. విజయ్ శంకర్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు బట్లర్, శాంసన్ 150(81) పరుగులు జోడించారు. 17 ఓవర్లకు రాజస్థాన్ 2 వికెట్లకు 172 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో మరింత చెలరేగాలని రాజస్థాన్ చూస్తోంది.
1️⃣0️⃣0️⃣👏🏾🎆@josbuttler brings up his maiden #VIVOIPL century in just 56 balls (10×4, 5×6). He is the 2nd @rajasthanroyals to get to triple figures this season!https://t.co/7vPWWkMqQ2 #RRvSRH #VIVOIPL pic.twitter.com/Kh3Aa2Du6J
— IndianPremierLeague (@IPL) May 2, 2021